AMARAVATI 1 : VIJAYAWADA : THE CITY OF VICTORY 1

Vijayawada (formerly known as Bezawada) is a city in the Indian state of Andhra Pradesh.It lies on the banks of River Krishna surrounded by the hills of Eastern Ghats known as Indrakeeladri Hills in Krishna District. It geographically lies on the center spot of Andhra Pradesh.The city has been described as the commercial, political, educational and media capital of Andhra Pradesh also the 27th largest city in India, second largest city in Andhra Pradesh and is one of the rapidly growing urban areas in India. It is considered to be a sacred place for residing one of the most visited and famous temples of Andhra Pradesh and India, Kanka Durga Temple of Hindu Goddess Durga. It also serves as the ritual host of Pushkaram (a river worshipping ritual in Andhra Pradesh and India) of River Krishna. Vijayawada is my place of birth – This article is also written in Telugu – the local language

VIJAYAWADA AIRPORT ROAD
VIJAYAWADA AIRPORT
VIJAYAWADA AIRPORT : TARMAC
VIJAYAWADA AIRPORT PLANE TAKEOFF
VIJAYAWADA : PANDIT NEHRU BUS STATION
VIJAYAWADA : PRAKASAM BARRAGE
VIJAYAWADA : PRAKASAM BARRAGE (NIGHT)
VIJAYAWADA : PRAKASAM BARRAGEKRISHNA VENI STATUE
VIJAYAWADA : PRAKASAM BARRAGE TOWARDS UPSTREAM SIDE OF KRISHNA RIVER
VIJAYAWADA : PRAKASAM BARRAGE
VIJAYAWADA : PRAKASAM BARRAGE TOWARDS DOWNSTREAM SIDE OF KRISHNA RIVER
VIJAYAWADA : PRAKASAM BARRAGE
VIJAYAWADA : PRAKASAM BARRAGE
VIJAYAWADA : GANDHI HILL SHOWING GANDHI STUPAM

విజయవాడ


విజయవాడ అమరావతి
బెజ్జంవాడ, బెజవాడ, రాజేంద్రచోళపురం
ముద్దుపేరు(ర్లు) : విక్టరీ ప్లేస్ – విజయ వాటిక
  • విజయవాడ నగర వీక్షణం
  • కనకదుర్గమ్మ దేవాలయం
  • ప్రకాశం బ్యారేజ్
  • విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్
  • వీ.యం .సీ స్థూపం

(పైన ఉన్న చిత్రాలు కుడి నుంచి గడియారపు ముల్లు తిరిగే దిశలో చూడండి)

  • విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం
  • విజయవాడ కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది
  • విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది
  • మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి
  • విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది
  • ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట

విజయవాడ – స్థల పురాణం


  • మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు
  • ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు
  • ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు
  • ఆపైన నాదంటే నాథని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు
  • అర్జునుడు తపస్సుచేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గ ఆలయం కొలువైన చోటని స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది
  • 11వ శతాబ్దిలోనూ, బహుశా 12వ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థలపురాణాన్ని ఆపాదిస్తున్నాయి

విజయవాడ

పేరు వెనుక కథలు


  • విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచీ బెజవాడ అన్న పేరు ఉంది
  • ఇక్కడి శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి
  • ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్నదానిపై పలు కథలు, సిద్ధాంతాలు ఉన్నాయి
  • అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సుచేసి, కిరాతరూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థలపురాణం ఉంది
  • దీనితో విజయుడన్న అర్జునుడి పేరుమీదుగానే విజయవాడ వచ్చిందని చెప్తారు
  • అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థలపురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు
  • జల మార్గంలోనూ, భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచీ వాణిజ్య కేంద్రంగా ఉండేది
  • ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు
  • బెజవాడ అన్న పేరు బ్లేజ్ వాడ నుంచి వచ్చిందనీ, విపరీతమైన ఎండలు ఉండడంతో దీన్ని బ్రిటీష్ వారు బ్లేజ్ వాడ అని పిలవగా పిలవగా జనవ్యవహారంలో బెజవాడ అయిందనీ కొందరు చెబుతారు

విజయవాడ – భౌగోళికం


విజయవాడ నగర దృశ్యం
  • భౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు
  • కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి
  • నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది
  • ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది
  • నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° – 49.7°సెం. మధ్య ఉంటాయి
  • చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది
  • నగరంలో వాడబడే ప్రధాన భాష తెలుగు
  • విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్

కొండపల్లి అడవులు


  • విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు
  • ఈ అడవులు విజయవాడకు ‘పచ్చని ఊపిరి’ లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి

Previous post TAJ MAHAL : AN ICON & A WORLD WONDER 6 – THE DETAILS
Next post AMARAVATI 2 : VIJAYAWADA : THE CITY OF VICTORY 2

No Copying Please !

Don`t copy text!